Xiaomi Mi Band 4 in Telugu – Features, Specifications,Price
Xiaomi Mi నుండి వచ్చే ప్రొడక్ట్స్ మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తునే ఉంటాయి. Xiaomi నుండి వచ్చిన Mi Bands ఫిట్నెస్ ట్రాకింగ్ విభాగంలో ఎంత సంచలనం సృష్టించాయో మనకు తెలిసిందే. ఇప్పుడు Xiaomi మరింత Advanced options తో Mi Band 4 ను ఇండియాలో ప్రవేశపెట్టబోతోంది. Xiaomi నుండి వచ్చే స్మార్ట్ ఫోన్ల దగ్గర నుండి Accessories వరకు అన్ని Mi బ్రాండ్ వాల్యూకు తగినట్టుగా ఉంటాయి. ఈ బ్రాండ్ తో వచ్చే ప్రొడక్ట్ ల నుండి మనం తక్కువ ధరకే మంచి క్వాలిటీని ఆశించవచ్చు.
భారతదేశం వంటి దేశాలలో Xiaomi ఏ విభాగంలో అడుగుపెడితే ఆ విభాగంలో ఒక విప్లవాన్ని తెచ్చిపెట్టింది. తక్కువ ధరలో ప్రొడక్ట్స్ తీసుకువచ్చి వినియోగదారులను పెంచుకుంది. ఫిట్నెస్ అభిమానులను తన అభిమానులుగా చేసుకోవడానికి Xiaomi ఇప్పుడు Mi Band 4 తో సిద్ధమైంది. కొత్త Mi Band 4 Fitness Tracker లో Xiaomi అడ్వాన్స్డ్ ఆప్షన్స్ తో కొంచెం పెద్ద మార్పులే చేసింది. Mi Band 4 చైనాలో మంచి ఆదరణ పొందింది. చైనాలో అమ్మకాలు ప్రారంభించిన ఎనిమిది రోజుల్లోనే 10 లక్షల యూనిట్లు విక్రయించింది. ఇతర Fitness Tracking బాండ్లకు పోటీగా Mi ఈ బాండ్ ను తయారుచేసింది.
Mi Band 4 ను ఇండియాలో లాంచ్ చేయబోయే తేదీ: సెప్టెంబర్ 17, 2019 (అంచనా). మరియు ఇండియాలో దీని ధర 2000 – 2500 రూపాయలు ఉండవచ్చట.
Xiaomi Mi Band 4 – Specifications:
Design:
Mi Band 4 అనేది Mi Band 3 తర్వాత వచ్చిన కొత్త మోడల్ ఫిట్నెస్ ట్రాకర్. Mi Band 3 తో పోలిస్తే Mi Band 4 లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. Mi Band 3 లో 0.78 ఇంచ్ OLED టచ్ స్క్రీన్ ఉంటే Xiaomi Mi Band 4 లో 0.95 ఇంచ్ AMOLED ఫుల్ కలర్ టచ్ స్క్రీన్ తో అప్ గ్రేడ్ చేసింది. ఇప్పుడు ఈ బ్యాండ్ యొక్క డిస్ప్లే పెద్దదిగా, ప్రకాశవంతంగా మరియు కలర్ ఫుల్ గా ఉంది. మరియు పగటిపూట కూడా చూడడానికి వీలుగా ఎక్కువ Brightness కలిగి ఉంది. ఇప్పుడు స్క్రీన్ పెద్దగా ఉండటం వలన మీ బ్యాండ్ లో ఎక్కువ సమాచారం చూడవచ్చు మరియు కలర్ డిస్ప్లే కలిగి ఉండటం వలన బ్యాండ్ యొక్క ఫేసెస్ తగిన విధంగా మార్చుకోవచ్చు. ఇక్కడ బ్యాండ్ యొక్క పేస్ అంటే మన మొబైల్లో వాల్ పేపర్ మార్చుకున్నట్టుగా బ్యాండ్లో కూడా మార్చుకోవచ్చు.
Mi Band 3 మరియు Mi Band 4 ను పోల్చిచూస్తే, ట్రాకర్ యొక్క కేసింగ్ ఇప్పుడు మందంగా ఉంది. ఫ్రంట్ గ్లాస్ బ్యాండ్ 3 లో ఉన్నట్టుగా వంగి (curved) లేదు, ఇప్పుడు సమానంగా (Flat) ఉంది. స్క్రీన్ మొత్తం టచ్ స్క్రీన్ అవడంవల్ల ప్రత్యేకమైన టచ్ బటన్ గాని బ్యాండ్ 3 లో ఉన్నట్టుగా గుంత వంటి ఆకారం గాని లేదు. బ్యాండ్ తో ఒక స్ట్రాప్ వస్తుంది. ఇతర రంగుల స్ట్రాప్ లు కావాలనుకుంటే కొనుక్కోవలసి ఉంటుంది. బ్యాండ్ 3 కి ఉపయోగించిన స్ట్రాప్ లను కూడా బ్యాండ్ 4 కూడా ఉపయోగించవచ్చు.

Xiaomi Mi Band 4 – Features :
ఈ బ్యాండ్ మనం నడిచిన అడుగులు లెక్కిస్తుంది, నడిచిన దూరం చెప్తుంది, క్యాలరీస్ సంబంధించిన సమాచారం అందిస్తుంది, ఐడిల్ అలర్ట్స్ ఇస్తుంది- ఐడిల్ అలర్ట్స్ అంటే మీరు ఎక్కువ సమయం కూర్చున్నప్పుడు లేచి అటు ఇటు తిరగమని ఎలర్ట్ ఇస్తుంది. మరియు హార్ట్ రేట్, వర్కౌట్ (అవుట్డోర్ రన్నింగ్, ట్రెడ్మిల్, సైక్లింగ్, వాకింగ్, ఎక్సర్సైజ్, పూల్ స్విమ్మింగ్), వాతావరణానికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇస్తుంది.
అలాగే ఇతర ఆప్షన్స్ అయినటువంటి Do Not Disturb, మ్యూజిక్, అలారం, స్టాప్ వాచ్, టైమర్, ఫైండ్ డివైస్, సైలెంట్, బ్యాండ్ డిస్ప్లే మరియు సెట్టింగ్స్ లో Brightness, లాక్ స్క్రీన్, రీబూట్, ఫ్యాక్టరీ రీసెట్, రెగ్యులేటరీ ఆప్షన్స్ కలిగి ఉంది.
Mi Band 4 కొత్త చార్జర్ డిజైన్ తో రావడం వలన పాత చార్జర్లు ఉపయోగించడానికి వీలుకాదు. ఇంతకుముందు బాండ్లలో చార్జింగ్ పెట్టడానికి Pogo పిన్నులు బ్యాండ్ కింద భాగంలో ఉండేవి. బ్యాండ్ 4 లో ఈ పిన్నులు బ్యాండ్ యొక్క వెనుక భాగంలో ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఛార్జింగ్ వైర్ ఒకవైపు కప్పు ఆకారంలో ఉండి వైర్ కు మరో వైపు Type-A USB ఉంది.
Mi Band 4 సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. >> Mi Band 4


Join the conversation