Bull Market and Bear Market Explained in Telugu – Tech Xpert


 
మనం పేపర్లలో గాని , టి.వి లలో గాని బుల్ మార్కెట్ (Bull Market) , బేర్ మార్కెట్ (Bear Market) అని ఎద్దు , ఎలుగుబంటి బొమ్మలను చూపిస్తూ ఉంటారు. అసలు బుల్ మార్కెట్ , బేర్ మార్కెట్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

బుల్ మార్కెట్ (Bull market) :

(Stock Market) స్టాక్ మార్కెట్ గమనాన్ని సూచించే సూచీలు అయినటువంటి సెన్సెక్స్ (Sensex) మరియు (Nifty)నిఫ్టీ లు వరుసగా లాభాల్లో కదులుతుంటే దానిని బుల్ మార్కెట్ అంటారు. లేదా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టె ఇన్వెస్టర్ లు స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తాయని నమ్మకంతో, ఆశావాద దృక్పధం తో ఉన్నట్లయితే దానిని Bullish లేదా Bull Market అని అంటారు . ఈ బుల్ మార్కెట్ లో పెట్టుబడి దారులందరు ఎక్కువగా షేర్లు కొనడానికి మొగ్గు చూపుతుంటారు . దాదాపు అన్ని కంపెనీల షేర్ల ధరలు పెరుగుతూ ఉంటాయి.

బేర్ మార్కెట్ (Bear Market):

సెన్సెక్స్ (Sensex) మరియు నిఫ్టీ (Nifty) లు వరుసగా నష్టాల్లో కదులుతున్నట్లైతే దానిని బేర్ మార్కెట్ అని అంటారు . లేదా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టె వాళ్లలో ఎక్కువమంది స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉంటాయి భయంతో ఉన్నట్లయితే దానిని ” Bearish ” లేదా Bear Market అని అంటారు. ఈ సమయంలో దాదాపు అన్ని కంపెనీల షేర్ల ధరలు కూడా పడిపోతూ ఉంటాయి. పెట్టుబడి దారులందరు భయంతో షేర్లు అమ్మడానికి మొగ్గు చూపుతారు. స్టాక్ మార్కెట్ అంతా ఒక వ్యతిరేకధోరణిలో , నష్టాల్లో , భయాందోళనలో ఉంటాయి.

 

అయితే స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉండడాన్ని అంటే బుల్ మార్కెట్ ని “ఎద్దు” తోనూ , స్టాక్ మార్కెట్ లు నష్టాల్లో ఉండడాన్ని “ఎలుగుబంటి” తోనూ సూచిస్తారు. దానికి ఒక కారణం ఉంది . అదేంటంటే ఎద్దు తన ప్రత్యర్థిని కొమ్ములతో పైకి లేపి విసిరేస్తుంది . కాబట్టి షేర్ల ధరలు పైకి పెరగడాన్ని బుల్ మార్కెట్ అని అంటారు. అలాగే ఎలుగుబంటి తన శత్రువులను పై నుండి కిందకు లాగివేస్తుంది . దానివల్ల షేర్ల ధరలు కిందకు పడిపోవడాన్ని బేర్ మార్కెట్ అని అంటారు.

ఎవరైతే మార్కెట్ పెరుగుతుంది అనే సానుకూల దృక్పధంతో ఉంటారో వాళ్ళని బుల్స్ అని అంటారు. అలాగే ఎవరైతే మార్కెట్ నష్టపోతోంది అనే నిరాశావాదంతో ఉంటారో వాళ్ళని బేర్ అని అంటారు. స్టాక్ మార్కెట్ ఎప్పుడూ ఈ బుల్స్ కి బేర్స్ కి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఒక రోజులో ఎక్కువగా షేర్ల కొనుగోళ్లు జరిగి , షేర్ల ధరలు పెరిగితే ఆ రోజు బుల్స్ గెలిచినట్టు. అలాగే షేర్ల అమ్మకాలు ఎక్కువగా ఉండి , షేర్ల ధరలు పడిపోతే ఆ రోజు బేర్స్ గెలిచినట్టు.

ఈ విధంగా షేర్ మార్కెట్ గమనాన్ని, పరిస్థితిని (Market Trend) సూచించడానికి ఈ బుల్స్ ని బేర్స్ ని వాడతారు.