Top Indian Bloggers and their Earnings in Telugu
How to Start a Website: Step by Step Guide:
ఆన్ లైన్ ద్వారా మనీ సంపాదించే మార్గాలలో Blogging (Blog లేదా Website లో ఆర్టికల్స్ వ్రాయడం) అనేది మొదటి స్థానంలో ఉంటుంది. వ్రాయడం అనేది మీకు హాబీ అయితే ఏ విషయం గురించి అయినా మీరు ఆసక్తికరంగా వ్రాయగలిగితే మీరు website ద్వారా మనీ సంపాదించవచ్చు. ఇప్పటికే మన దేశంలో ఈ Blogging ద్వారా లక్షలు సంపాదిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఇలా website ని మొదలుపెట్టి ఆర్టికల్స్ రాస్తూ సంపాదించాలి అనుకుంటున్నారా? website క్రియేట్ చెయ్యడం కోసం మీకు కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. మీకు మీరే website ని సులువుగా క్రియేట్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు step by step వివరంగా తెలుసుకుందాం.
1. Amit Agrawal:

ఇండియాలో Blogging ని మొట్టమొదటిగా వృత్తిగా చేపట్టిన వ్యక్తి ఇతను. ఇప్పుడు ఉన్న ఎంతోమంది బ్లాగర్స్ కి ఇతనే ఇన్స్పిరేషన్. మొదట్లో ఈయన అమెరికాలో ఉద్యోగం చేసేవారు. కానీ ఆ ఉద్యోగాన్ని వదిలేసి Labnol.org అనే టెక్నాలజీ కి సంబందించిన website ని స్టార్ట్ చేసారు. ఇప్పుడు ఈ website ప్రపంచవ్యాప్తంగా Top 100 Technology Website List లో ఒకటిగా ఉంది.
Website: Labnol.org(Digital Inspiration)
Location: New Delhi, India.
Estimated Earnings: ₹30,00,000/-.per month
2. Harsh Agarwal:

ఇతను 2008లో ShoutMeLoud అనే website ని స్టార్ట్ చేసాడు. ఈ బ్లాగ్ లో Online money earning, Blogging, SEO వంటి వాటి గురించి తెలియచేస్తాడు. మొదట్లో ఇతను Convergys అనే ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో పనిచేసేవాడు. కానీ ఆ ఉద్యోగాన్ని వదిలేసి సొంతంగా website ని స్టార్ట్ చేసాడు. మీరు కొత్తగా website స్టార్ట్ చేస్తున్న వారైతే ఈ ShoutMeLoud website మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
Website: ShoutMeLoud.com
Location: New Delhi, India.
Estimated Earnings: ₹25,00,000/-.per month
3. Shradha Sharma:

2008 లో ఈమె YourStory అనే Website ని స్టార్ట్ చేసి Entrepreneurs, Leaders, Startups గురించి వ్రాయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇండియా లోని టాప్ వెబ్ సైట్ లలో YourStory కూడా ఒకటి. ఈ website వలన ఈమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
Website: YourStory.com
Location: Bangalore, India
Estimated Earnings: ₹20,00,000/-.per month
4. Amit Bhawani:

ఇతను 2007 లో Amit Bhawani అనే website ని స్టార్ట్ చేసి ఆ website లో Technology, Mobiles,Gadgets వంటి వాటి గురించి వ్రాయడం మొదలుపెట్టారు. తరువాత ఈయన 2014 లో PhoneRadar.com అనే మరొక వెబ్ సైట్ ని మొదలుపెట్టారు. ఇప్పుడు ఈయన స్వయంగా టెక్నాలజీ కి సంబందించిన ఒక కంపెనీని నడుపుతున్నారు.
Website: AmitBhawani.com, PhoneRadar.com
Location: Hyderabad
Estimated Earnings: ₹10,00,000/-.per month
5. Srinivas Tamada:

చెన్నై కి చెందిన శ్రీనివాస్ 2009 లో వెబ్ సైట్ ని స్టార్ట్ చేసి దానిలో ప్రోగ్రామింగ్, Ajax, PHP, Web design కి సంబంధించిన ఆర్టికల్స్ అందిస్తున్నాడు. ప్రస్తుతానికి ఇతను అమెరికా లో నివసిస్తూ అక్కడ నుండి website ని నడిపిస్తున్నాడు.
Website: 9Lessons.info
Location: Chennai & USA
Estimated Earnings: ₹10,00,000/-.per month
6. Imran Uddin:

ఈ టాప్ బ్లాగర్స్ జాబితాలో మన తెలుగువాడు కూడా ఉన్నాడు. హైదరాబాద్ కి చెందిన Imran Uddin 2012లో 18 ఏళ్ల వయసులోనే website ని స్టార్ట్ చేసాడు. Alltechbuzz పేరుతో వెబ్ సైట్ ని మొదలుపెట్టి దానిలో Blogging, SEO కి సంబందించి వ్రాయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు Alltechmedia పేరుతో ఒక సంస్దను స్థాపించి మరెన్నో Tech website లను నడిపిస్తున్నాడు.
Website:Alltechbuzz.net
Location: Hyderabad
Estimated Earnings: ₹5,00,000-10,00,000/-.per month
ఇలా మరెంతో మంది బ్లాగింగ్ ద్వారా వేలు, లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మీరు గమనించినట్టైతే వీరందరూ కూడా కొన్ని సంవత్సరాల నుండి కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నారు. మొదట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది అయినా వదలకుండా మెల్లమెల్లగా ఒక్కొక విషయం నేర్చుకుంటూ ఓపికగా కష్టపడండి. తప్పకుండా మీరు కూడా ఆ స్థాయికి చేరుకుంటారు.
All The Best

Join the conversation