Top 10 Stocks that made Highest Money Between 2014-2019 in Telugu
గత 5 సంవత్సరాలలో అధిక రాబడిని ఇచ్చిన టాప్ 10 స్టాక్స్ :
భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా మారుతున్నది ఈ మార్పుకి కారణం కొన్ని కార్పొరేట్ దిగ్గజాలు, అయితే గత ఐదు సంవత్సరాలలో (2014 – 2019) స్టాక్ మార్కెట్ లో అత్యధిక లాభాలు రాబట్టిన కొన్ని కంపెనీల జాబితాను ఇప్పుడు తెలుసుకుందాం..
10. Axis Bank
వివిధ దేశాలలో బ్రాంచీలు కలిగి ముంబైలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ ప్రైవేట్ బ్యాంక్, గత ఐదు సంవత్సరాల మొత్తంలో 1.2 లక్షల కోట్ల లాభాలను సంపాదించుకుంది, అలాగే దీని షేర్ యొక్క విలువ 52% పెరిగింది.

9. Maruti Suzuki
ఈ జాబితాలో ఉన్న ఏకైక ఆటోమొబైల్ ఇండస్ట్రీ, గత సంవత్సరం లో 8% నష్టాలను పొంది ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ నెమ్మది చడం వల్ల ఇబ్బందికి గురి అవుతున్న ఈ షేర్ విలువ గత ఐదు సంవత్సరాల మొత్తానికి 1.4 లక్షల కోట్ల లాభాలను సంపాదించుకుంది.

8. Infosys
బెంగళూరులో ప్రధాన కార్యాలయంగా ఉండి నారాయణమూర్తి మరియు నందన్ నిలేకని చే స్థాపించబడ్డ ఈ సాఫ్ట్ వేర్ దిగ్గజం గత ఐదు సంవత్సరాల మొత్తానికి 1.49 లక్షల కోట్ల లాభాన్ని సంపాదించుకుంది. అలాగే దీని షేర్ యొక్క విలువ పెరిగింది.

7. Bajaj Finance
బజాజ్ హోల్డింగ్ సన్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ లో భాగమైన ఈ కంపెనీ యొక్క షేర్ విలువ అతి వేగంగా 1145 శాతం పెరిగింది, అయితే కేవలం గత సంవత్సరం లోనే ఈ షేర్ యొక్క విలువ 59 శాతం పెరగడం విశేషం.

6. HDFC
హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో చాలా అద్భుతంగా రాణిస్తున్న ఈ NBFC 1977లో స్థాపించబడినది. ఈ కంపెనీ యొక్క షేర్ వాల్యూ గత సంవత్సరం లోనే 22 శాతం పెరగగా ఐదు సంవత్సరాల మొత్తానికి 117 శాతం పెరిగింది.

5. Kotak Bank
సెక్యూరిటీస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో ఎన్నో అనుబంధ సంస్థలతో ఉదయ్ కోటక్ నడిపిస్తున్న ఈ కంపెనీ యొక్క షేర్ విలువ గత సంవత్సరం లో 40 శాతం పెరగగా ఐదు సంవత్సరాల మొత్తానికి 179 శాతం పెరిగింది.

4. Hindustan Unilever
లిప్టన్, బ్రూక్ మరియు knorr లాంటి ఫేమస్ కన్జ్యూమర్ బ్రాండ్ లను కలిగి ఉన్న ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీ గత సంవత్సరంలో 6 శాతం పెరగగా 5 సంవత్సరాల మొత్తానికి 160 శాతం పెరిగింది.

3. TCS
ఈ మధ్య కాలంలో టాప్ ఎంప్లాయర్ ఇన్ ఏషియా గా పేరుపొందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐదు సంవత్సరాల మొత్తానికి 74% పెరగగా గత సంవత్సరంలో 11 శాతం పెరిగింది. అయితే ఈ కంపెనీ మొత్తానికి 3.6 లక్షల కోట్ల లాభాన్ని సంపాదించుకుంది.

2. HDFC Bank
2016లో ఇండియాలోనే అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండి ముంబాయిలో ప్రధాన కార్యాలయంగా ఆదిత్య పురి చే నడపబడుతున్న ఈ ప్రైవేట్ బ్యాంక్, ఐదు సంవత్సరాల మొత్తానికి 170 శాతం పెరగగా గత సంవత్సరం లోనే 22 శాతం పెరగడం విశేషం. అయితే ఈ కంపెనీ మొత్తానికి 4 లక్షల కోట్ల లాభాన్ని సంపాదించుకుంది.

1. Reliance Industries
భారతదేశంలోని అతి పెద్ద కార్పొరేట్ దిగ్గజం గా పేరుపొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు స్థాయిలో గత సంవత్సరంలో 39 శాతం పెరగగా 5 సంవత్సరాల మొత్తానికి 250 శాతం పెరిగింది. ఈ కార్పొరేట్ దిగ్గజం చాలా పెద్ద తేడాతో wealth-creating లిస్టులో టాప్ ర్యాంకును సంపాదించుకుంది.



Join the conversation