Reliance Jio Mart details in Telugu

 

    

Reliance Jio Mart for Groceries

గ్లోబల్ ఈ–కామర్స్ కంపెనీలు అమెజాన్, వాల్‌‌‌‌మార్ట్‌‌‌‌లకు పోటీగా ముకేశ్ అంబానీ తన కొత్త కామర్స్ వెంచర్‌‌‌‌‌‌‌‌ను సాఫ్ట్‌‌‌‌ లాంచ్ చేశారు. దీనికి ‘జియో మార్ట్’ గా నామకరణం చేశారు.అయితే ఈ ‘జియో మార్ట్’ సరకుల డెలివరీ సేవలను అందించనుంది.

జియోమార్ట్ సొంతగా ఉత్పత్తులను అందించకుండా,ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే దుకాణాలను వినియోగదారులతో అనుసంధానించే యాప్ ను తెస్తోంది.అంటే స్విగ్గి, జొమాటో యాప్ లు స్థానికంగా ఉన్న రెస్టారెంట్ లను వినియోగదారులతో అనుసంధానపరుస్తున్నట్టు, ‘జియో మార్ట్’ మన పరిసరాలలో ఉన్న దుకాణాలను మనకు అనుసంధానం చేసే ప్రక్రియలో ఉంది.

ప్రస్తుతం ఆన్లైన్ సరకుల మార్కెట్ భారత్ లో ఇంకా శైశవ దశలోనే ఉంది. మొత్తం జనాభాలో కేవలం 0.15 శాతమే ఈసేవలను వినియోగించుకుంటున్నారని, ఏటా రూ.6200 కోట్ల మేర అమ్మకాలు సాగుతున్నాయని అంచనాలు ఉన్నాయి.అయితే 2023 కి అమ్మకాల విలువ రూ.1.03 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు.

మొదటగా పైలట్ ప్రాజెక్టు కింద ముంబై, థానే  కళ్యాణ్‌ నగర్లో  జియో మార్ట్ సేవలను  ప్రారంభించిన జియో మార్ట్ తర్వాత ఇండియా అంతట తన మార్కెట్ ను విస్తరించనుంది. జియో మార్ట్ ద్వారా మూడు కోట్ల షాప్ సేవలు, 20 కోట్ల మంది కస్టమర్లకు చేరువయ్యేలా  అంచనా వేస్తుంది రిలయన్స్.

జియో మార్ట్ లో మొదటగా 50 వేల రకాల ప్రాడక్ట్స్ ను  కస్టమర్స్ కు అందుబాటులో ఉంచుతుంది. అంతేగాకుండా ఎలాంటి షరతులు లేకుండా ఉచిత హోమ్ డెలీవరీ , కస్టమర్లు వస్తువులు తిరిగి ఇవ్వడం, తక్కువ సమయంలో త్వరగా డెలీవరీ వంటి సేవలు అందిస్తామని జియో మార్ట్ తన వెబ్ సైట్లో తెలిపింది. అంతే కాకుండా కొనుగోలు విలువ ఇంత ఉండాలని పరిమితి ఏమీ ఉండదని కూడా పేర్కొంది.