Jio Fiber కనెక్షన్ పొందడం ఎలా ? – How to Get Jio Fiber Connection?

Jio Fiber Registration Process:

Reliance Jio Fiber ఈ రోజు అందుబాటులోకి వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ AGM (Annual General Meeting ) సందర్భంగా వెల్లడించిన జియో ఫైబర్ ప్లాన్ లు రూ .700 నుంచి రూ .10,000 వరకు ఉన్నాయని మరియు కస్టమర్లకు 100 Mbps నుంచి 1 Gbps బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ లభిస్తుందని చెప్పారు. 100 Mbps కనెక్షన్‌ను ఎంచుకోవాలనుకునే వారు రూ .700 బేస్ ప్లాన్‌ను ఎంచుకోవాలి. రిలయన్స్ జియో ఫైబర్ ఇప్పటికే 1.5 కోట్ల రిజిస్ట్రేషన్లను పొందింది మరియు భారతదేశంలోని 1,600 పట్టణాల్లో సుమారుగా 3. 5 కోట్ల మందికి Jio Fiber సేవలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తుంది .

 

Jio Fiber కనెక్షన్ ఎలా పొందాలి?

1. కొత్త కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా Jio Fiber కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

2. రిజిస్ట్రేషన్ కోసం వెబ్‌సైట్‌లో వినియోగదారులు మొదట Jio Fiber బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను కోరుకునే స్థానాన్ని ఎంచుకోవాలి. ,
వారు ఎంచుకున్న స్థానం వారి Home Address లేదా Work Address అనేది సెలెక్ట్ చేసుకోవాలి . తరువాత, పూర్తి పేరు, మొబైల్
నంబర్ మరియు ఇమెయిల్ ఐడిని నమోదు చెయ్యాలి .

3. రిజిస్ట్రేషన్ కొరకు అందించిన ఫోన్ నంబర్‌కు పంపిన OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్) ను టైపు చేసి verification ను
పూర్తిచేసుకోవాలి .

4. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, రిలయన్స్ జియో Sales Executive Jio Fiber కనెక్షన్ యొక్క installation
కోసం మనల్ని సంప్రదిస్తారు.

 

Jio Fiber Installation చార్జీలు:

Jio Fiber Installation పూర్తి ఉచితంగా చేయడం జరుగుతుంది కానీ Internet Router కొరకు 2500/-(Refundable amount ) సెక్యూరిటీ డిపాజిట్ కట్టవలసి ఉంటుంది .

Jio Fiber లాభాలు :
1. Annual plan subscription తీసుకున్నవారికి HD లేదా 4K LED TV తో పాటుగా Setup-Box ఉచితంగా లభిస్తుంది .

2. Jio ప్రీమియం Subscribers కు సినిమా రిలీజ్ అయిన రోజునే First Day First Show వాళ్ళ ఇంట్లోనే చుసే అవకాశం లభిస్తుంది .

3. Subscription తీసుకున్నవారికి High – Speed Broadband తో పాటుగా Unlimited Voice Calls లభిస్తాయి మరియు Unlimited International calling ప్యాక్ నెలకు కేవలం Rs 500/- లకే లభిస్తుంది .

Jio Fiber Registration కొరకు ఈ లింక్ పై click చేయండి >> Jio Fiber Registration