Apple Facts in Telugu- Facts About Apple Company
Interesting Facts About Apple Company
Apple బ్రాండ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ కంపెనీ గురుంచి తెలియని వ్యక్తే ఉండరు. అటువంటి ఆపిల్ కంపెనీ గురుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
1. ఆదాయం మరియు మొత్తం ఆస్తుల పరంగా ఆపిల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఐటి సంస్థ మరియు ప్రపంచంలో ఫోన్లు తయారీ చేసే అతి పెద్ద సంస్థల్లో ఆపిల్ రెండవ స్థానంలో ఉంది.
2. ఆపిల్ కంపెనీ ప్రతి నిమిషానికి దాదాపుగా 21 కోట్ల రూపాయలు సంపాదిస్తుంది.
3. ఆపిల్ ప్రధాన కార్యాలయంలో సగటు ఉద్యోగి జీతం సంవత్సరానికి 9 కోట్లు.
4. 2018 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ కంపెనీ రోజుకు సగటున 5,72,000 iPhones అమ్మింది.
5. మీకు తెలుసా! ఆపిల్ ఐప్యాడ్ యొక్క రెటీనా డిస్‌ప్లేను, శామ్‌సంగ్ కంపెనీ తయారు చేస్తుంది.
6. ఆపిల్ యొక్క కో-ఫౌండర్ లో ఒకరు తన షేర్స్ అన్ని ($800) 57 వేల రూపాయలకు అమ్మేసాడు. కానీ ఇప్పుడు ఆ షేర్స్ విలువ (US $ 35 బిలియన్) 2 లక్షల 50 వేల కోట్లు .
7. అమెరికా గవర్నమెంట్ దగ్గర ఉన్న మొత్తం నిధులు కన్నా ఆపిల్ కంపెనీ దగ్గర ఉన్న డబ్బే ఎక్కువట.
8. ప్రతి ఆపిల్ ఫోన్ ఆడ్ లో కూడా ఫోన్ లో టైం 09:41 AM అని ఉంటుంది. ఎందుకంటే స్టీవ్ జాబ్స్ (Steve Jobs) మొట్టమొదటి ఐఫోన్ ని 09:41 AM కి ఆవిష్కరించాడు.
9. 2014 మొదటి క్వార్టర్ లో, గూగుల్, ఫేస్‌బుక్ మరియు అమెజాన్ కలిపి సంపాదించిన దాని కంటే ఆపిల్ కంపెనీ ఎక్కువ సంపాదించింది.
10. మీకు తెలుసా! ఆపిల్ కంపెనీ లో జాబ్ సాధించడం కంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సీట్ సాధించడం తేలికట.
11. ఆపిల్ మాక్‌బుక్ (Mac book) యొక్క బ్యాటరీ మిమ్మల్ని తుపాకీ కాల్పుల నుండి కాపాడగలదు. ఇది బుల్లెట్‌ప్రూఫ్.
12. మీరు కనుక ఆపిల్ కంప్యూటర్ల దగ్గర ధూమపానం చేసినట్లయితే దాని యొక్క వారంటీ తగ్గిపోతుంది.
13. స్టీవ్ జాబ్స్ CEO గా తన వార్షిక వేతనంగా ఆపిల్ ఖాతా నుండి కేవలం US $1 ను మాత్రమే తీసుకునేవాడు.
14. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఐఫోన్ 5 విలువ (US $15 Millions) 106 కోట్లు . దీనిని 135 గ్రాముల 24 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు మరియు చుట్టూ ఫినిషింగ్ కోసం 600 వైట్ డైమండ్స్ ని ఉపయోగించారు.

Join the conversation