Alphabet CEO Sundar Pichai Salary in Telugu
Alphabet CEO Sundar Pichai Salary:
ప్రపంచంలోనే అత్యధిక జీతం తీసుకుంటున్న CEO లలో మన భారతీయుడు అయినటువంటి సుందర్ పిచాయ్ ఒకరు.అయితే మరోసారి ఇతనికి పారితోషకం పెరగబోతుంది….గూగుల్ మాతృసంస్థగా పిలవబడే ‘ఆల్ఫాబెట్'(Alphabet) కంపెనీకి కొత్త CEO గా సుందర్ పిచాయ్ ని ఈ మధ్యనే నియమించారు. ఆల్ఫాబెట్ CEO గా ఇప్పటివరకు పనిచేసిన లారి పేజ్ డిసెంబర్ 3న పదవి నుండి తప్పుకున్నారు.
2015 సంవత్సరం నుంచి గూగుల్ కంపెనీ కి CEO గా చేస్తున్న సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ కి వెళ్ళగానే అతని యొక్క వేతనం అధికంగా పెరిగింది. ఎలా అంటే సంవత్సరానికి దాదాపుగా 2 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం-14,20,00,000/-) వేతనంతో పాటు, అలానే ఆల్ఫాబెట్ ముందుండే లక్ష్యాలను చేరుకోగలిగితే 2020 నుంచి మరో మూడు సంవత్సరాల పాటు 240 మిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీ ప్రకారం-17,04,00,00,000/-)విలువ చేసే స్టాక్ అవార్డు లభించనుంది.
అంతేకాకుండా ఆల్ఫాబెట్ షేర్ల విలువ పెరుగుదలకు అనుగుణంగా 90 మిలియన్ డాలర్ల (6,39,00,00,000/-) విలువగల షేర్లు అదనపు బోనస్ గా లభించనున్నాయి. ఈ విధంగా పనితీరుని బట్టి కంపెనీ యొక్క షేర్లను బోనస్ గా ఇవ్వడం కాలిఫోర్నియాలో నెలకొన్న ఆల్ఫాబెట్ కంపెనీ చరిత్రలోనే ఇది తొలిసారి. అయితే మాజీ CEO, గూగుల్ సహవ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గ్ బ్రిన్ లకు గూగుల్ లో 6 శాతం వాటాలుండగా సుందర్ పిచాయ్ కి ఆ రూపంలో పరిహారం ఏమి లభించలేదు.

ఇది ఇలా ఉంటే ఈ మధ్యన జరిగిన ఉద్యోగుల సమావేశంలో అక్కడ పనిచేసే ఒక ఉద్యోగి సుందర్ కి అంత పారితోషకం ఇవ్వడం అవసరమా అని ప్రశ్నించాడు. అయితే 47 సంవత్సరాల ఈ భారతీయ ఇంజనీర్ కు ఇలాంటి భారీ ప్యాకేజీలు కొత్తేమి కాదు, సుందర్ 2016లో 200మిలియన్ డాలర్లను స్టాక్ అవార్డు రూపంలో పొందాడు. 2018లో అయన మొత్తం వేతనం 1.9 మిలియన్ డాలర్లు. ఆ సంవత్సరంలో షేర్ల రూపంలో ఇవ్వబోయిన మరో భారీ బోనస్ ను సుందర్ పిచాయ్ వద్దన్నారు. చెన్నైలో ఉండే అతి సాధారణమైన కుటుంబం నుంచి వెళ్లి అత్యధిక జీతంతో పాటు గొప్ప పేరుని సంపాదించుకున్న సుందర్ పిచాయ్ మన దేశానికి గర్వకారణంగా నిలిచారు.

Join the conversation